సూపర్‌స్టార్ కృష్ణ జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆయన తనయుడు మహేష్‌బాబు, మిగతా కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన ఫొటోలు, అవార్డులను ప్రదర్శనకు ఉంచాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాలయ స్టూడియోస్ వద్ద దీన్ని నిర్మించనున్నట్లు సమచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో నిర్వహించిన కృష్ణ చిన్న కర్మలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెమోరియల్ విషయమై చర్చించారని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.