Namaste NRI

మిస్టర్ కింగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన సూప్టర్ స్టార్ కృష్ణ

విజయ నిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా మిస్టర్‌ కింగ్‌ అనే చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్‌ పతాకంపై బిఎన్‌ రావు నిర్మిస్తున్నారు. శశిధర్‌ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న మిస్టర్‌ కింగ్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ సందర్భంగా విజయ నిర్మల జయంతి సంద్భంగా సినిమా పోస్టర్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా హీరోగా శరణ్‌ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సినిమా సూపర్‌ హిట్‌ కావాలి అని అన్నారు. మంచి వ్యక్తిత్వం అంటే రాజు అన్నట్లే. అందుకే ఈ టైటిల్‌ను పెట్టారు. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఆకట్టుకోవాలి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అన్నారు. చిత్ర దర్శకుడు శశిధర్‌ చావలి మాట్లాడుతూ చక్కటి కుటుంబ కథా చిత్రంగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగే సినిమా ఇదని తెలిపారు. చిత్ర హీరో శరణ్‌ మాట్లాడుతూ ఈ సినిమా యూత్‌ఫుల్‌ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌. యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ : తన్వీర్‌ అంజుమ్‌. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నరేశ్‌, నిర్మాత బి.ఎన్‌.రావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News