Namaste NRI

దండోరాని ఆదరించండి : నవదీప్‌

శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించిన దండోరా చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మురళీకాంత్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. అందరూ ప్రాణం పెట్టి పనిచేసిన సినిమా ఇదని, తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌ వంటి దర్శకుడితో ఈ సినిమా డైరెక్టర్‌ను పోల్చి చూస్తున్నారని శివాజీ చెప్పారు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన చిత్రమిదని నవదీప్‌ చెప్పారు.

ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఈ సినిమాను ప్రశంసిస్తున్నారని నిర్మాత పేర్కొన్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇస్తున్నారని, ఈ విజయం సినిమాకు పడిన కష్టాన్ని మరచిపోయేలా చేసిందని, అందరూ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారని దర్శకుడు మురళీకాంత్‌ పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత దండోరా రూపంలో తనకు తెలుగులో మంచి విజయం దక్కిందని బిందు మాధవి తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events