చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టం తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన కార్యక్రమానికి ఎన్నారై మహిళల తరఫున మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మహిళలందరినీ ఏకం చేసి కవిత ఖచ్చితంగా చట్టాన్ని సాధిస్తారని తెలిపారు. తమ వంటి ఎంతో మంది ఆడబిడ్డలకు రోల్ మోడల్ కవిత అక్క అని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం భారత్ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అని తెలిపారు. విదేశాల్లో ఉంటూ కూడా బతుకమ్మ పండుగ ప్రాముఖ్యాన్ని తమ పిల్లలకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.