Namaste NRI

నలుగురు భారతీయులకు కెనడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జార్ హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న‌ న‌లుగురు భార‌తీయుల‌కు కెన‌డా సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరీ చేసింది. బ్రిటీష్ కొలంబియా అత్యున్న‌త కోర్టులో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన మ‌ళ్లీ ఈ కేసుపై విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. హ‌త్య కేసులో ఆధారాలు స‌రిగా లేని కార‌ణంగా,  నిందితుల‌కు బెయిల్ మంజూరీ చేస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. క‌ర‌ణ్ బ్రార్‌, అమ‌న్‌దీప్ సింగ్‌, క‌మ‌ల్‌ప్రీత్ సింగ్‌, క‌ర‌ణ్‌ప్రీత్ సింగ్‌ల‌పై ఫ‌స్ట్ డిగ్రీ మ‌ర్డ‌ర్‌, కుట్ర కేసు న‌మోదు అయ్యింది. బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని స‌ర్రేలో ఉన్న గురుద్వారా వ‌ద్ద నిజ్జార్‌ను 2023, జూన్ 18వ తేదీన కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. కెన‌డా రాయ‌ల్ పోలీసులు,  2024 మే నెల‌లో క‌ర‌ణ్‌ప్రీత్‌, క‌మ‌ల్‌ప్రీత్‌, క‌ర‌న్ బ్రార్‌ను అరెస్టు చేశారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ముగ్గురు నిందితులు కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌రు నేరుగా కౌన్సిల్ ద్వారా కోర్టుకు హాజ‌ర‌య్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events