వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం విరాజి. ఆద్యంత్ హర్ష దర్శకుడు. ఆగస్ట్2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ విలేకరులతో ముచ్చటించారు. దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ ఎలాగైతే ఆకట్టుకునేలా చెప్పాడో, అంతేబాగా తెరకెక్కించాడు. సమాజంలోని ఓ ముఖ్యమైన అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి రూపొందించిన సినిమా ఇది. ఇదొక మంచి కంటెట్. చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం అని అన్నారు.
ముందు హీరో పాత్రకు ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నాం. నాకు సెట్‌కొచ్చి వెళ్లిపోయే హీరో కాకుండా, సినిమా మొత్తం సపోర్ట్‌గా నిలిచే హీరో కావాలి. అందుకే వరుణ్‌సందేశ్‌ని తీసుకున్నాం. ఈ కథకు కూడా ఆయన యాప్ట్. తను యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. తన డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఈ పాత్రకు కలిసొ చ్చింది. నటీనటుల దగ్గర్నుంచీ, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ మనసుపెట్టి పనిచేశారు. తప్ప కుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నా అని మహేంద్రనాథ్ పేర్కొన్నారు.