Namaste NRI

మెగా అభిమానులకు సర్ ప్రైజ్… భోళా శంకర్ గా

మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.  ఆగస్టు 22న మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా  ఆయన కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్వకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి భోళా శంకర్‌ అనే పేరును ఖరారు చేశారు. చిరు 66వ పుట్టినరోజుని పుస్కరించుకుని చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసి చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తమిళ్‌ బ్లాస్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న వేదాళం రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో అజిత్‌ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్‌లో ముందుగా పవన్‌ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మెగాస్టార్‌ ఈ రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే ఈ చిత్రంలో చిరుకి సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News