సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెట్రో. స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ను వెల్లడించడంతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. కాశీ ఘాట్‌లో సూర్య, పూజాహెగ్డేల మధ్య సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ప్రేమకోసం తాను హింసాత్మకమైన గ్యాంగ్‌స్టర్ ప్రపంచం నుంచి తప్పుకుంటానని,పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతానని సూర్య చెప్పే సంభాషణలు భావోద్వేగభరితంగా సాగాయి. సూర్య, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. సూర్య ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, రొమాన్స్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగింది. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్‌కృష్ణ, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: జ్యోతిక, సూర్య, రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.