సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భవనం. బాలా చారి కూరెళ్ల దర్శకుడు. ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాత లు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ది హాంటెడ్ హౌస్ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందు తున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది. ఓ భవనం నేపథ్యంలో నడిచే వినోదా త్మక హారర్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, రచన, మాటలు, దర్శకత్వం: బాలా చారి కూరెళ్ల.