ప్రఖ్యాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, డా.రాజేంద్రప్రసాద్, అచ్చిరెడ్డి, శ్రీకాంత్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, శివాజీ రాజా, బండ్ల గణేశ్, గీత రచయిత చంద్రబోస్‌లతో పాటు రోజా, ఆమని, రవళి, ఇంద్రజ, లయ పాల్గొన్నారు.

32ఏండ్ల కెరీర్‌లో 42 ఎవర్‌గ్రీన్ చిత్రాలను రూపొందించడమే కాక, ఎంతోమంది కళాకారుల జీవితాలకు బలమైన పునాదులు వేసిన ఘనత ఎస్వీకృష్ణారెడ్డిదని వారంతా కొనియాడారు. నేను అవకాశాలిచ్చానని వీరంతా చెబుతున్నారు. కానీ వీరంతా స్వతహాగా ప్రతిభామూర్తులు. నా సినిమాలు వారి ప్రతిభను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. అంతేకానీ వారికి నేను ప్రత్యేకంగా చేసిందేం లేదు అని ఎస్వీకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Singapore