Namaste NRI

లండన్‌లో ఘనంగా టాక్‌ చేనేత బతుకమ్మ-దసరా సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్ , తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.

గత కేసిఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్‌ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను ‘చేనేత బతుకమ్మ, దసరా’గా జరుపుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి రెండు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events