ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి ఏటా బ్యాక్ ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని తానా నాయకులు న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి మౌనిక మానికొండ చేపట్టారు.


న్యూ ఇంగ్లాండ్‌లో ఆగస్టు 27వ తేదీన ఫ్రాంక్లిన్‌లోని ఆరు స్కూళ్లల్లో స్కూల్‌లోని పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమం కింద దాదాపు 200కు పైగా బ్యాగ్‌లను పిల్లలకు అందజేశారు. ఇందులో క్రేయాన్స్, ఎరేజర్స్, పెన్సిల్, షార్పనర్స్, పెన్నులు తదితర వస్తువులను కూడా కలిపి అందజేశారు.


ఈ కార్యక్రమంలో న్యూ ఇంగ్లాండ్‌లోని తానా నాయకులు పాల్గొన్నారు. తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి మౌనిక మానికొండ తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, త్రిభువన్ పారుపల్లి పాల్గొన్నారు. అస్సిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ టీన రోజర్స్ తన ప్రకటనలో తానా దాతృత్వం చిన్నారులు ముఖాల్లో చాలా చిరునవ్వులు తెస్తుందని అన్నారు. తానా చేస్తున్న ఈ సేవ కార్యాక్రమాలు సంఘంలోని తల్లి తండ్రులకు చాలా స్ఫూర్తినిస్తుంది వివరించారు.

















