Namaste NRI

అట్లాంటాలో తానా పికిల్‌ బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతం

తానా మహాసభలను పురస్కరించుకుని జూన్‌ 22న  గ్రేటర్‌ అట్లాంటా ఆల్ఫారెట్టాలోని ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన తానా పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది. ఈ టోర్నమెంట్‌ లో 50కి పైగా టీమ్‌ లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌ విజయవంతానికి తానా నాయకులు, వలంటీర్లు కృషి చేశారు. 

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు అవసరమైన దిశానిర్దేశం చేయగా, బోర్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ లావు మార్గదర్శకత్వం చేశారు.  భరత్‌ మద్దినేని (కోశాధికారి), వినయ్‌ మద్దినేని (ఫౌండేషన్‌ కోశాధికారి), కిరణ్‌ గోగినేని (ఫౌండేషన్‌ జాయింట్‌ కోశాధికారి), మధుకర్‌ యార్లగడ్డ (ప్రాంతీయ ప్రతినిధి – సౌత్‌ ఈస్ట్‌) టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌  నాగ పంచుమర్తి టోర్నమెంట్‌ రూపకల్పనతోపాటు సజావుగా జరిగేలా చూశారు. చలమయ్య బచ్చు, లక్కీ, ఉదయ్‌ తదితరులు టోర్నమెంట్‌ విజయానికి అవసరమైన మద్దతును అందించారు. వీరితోపాటు ఈ టోర్నమెంట్‌ విజయానికి సహకరించిన సోహిని అయినాల (మహిళా సేవల సమన్వయకర్త), శశి దగ్గుల, చందు, లక్ష్మి, ఉదయ్‌, ఎజెలకు కూడా తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events