Namaste NRI

మదనపల్లిలో ‘తానా’  సేవా కార్యక్రమాలు విజయవంతం

తానా కార్య నిర్వాహక సభ్యులు శ్రీ కొణిదెల లోకేష్ నాయుడు గారి  స్వస్థలం మదనపల్లి పట్టణం లో తానా చైతన్య స్రవంతి సందర్బంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలు రెండురోజుల పాటు విజయవంతమయ్యాయి. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి, పూర్వాధ్యక్షులు శ్రీ వేమన సతీష్,  కన్వెన్షన కన్వీనర్ శ్రీ రవి పొట్లూరి, చైతన్య శ్రవంతి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ పాంత్రా మరియు ఇతర స్థానిక ప్రముఖులు దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి అంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.

తానా సాంసృతిక  కళోత్సవాలో భాగంగా ప్రముఖ సినీ గాయకులు  సింహ మరియు బృందం ప్రదర్శించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. మొదటి రోజు శ్రీ లోకేష్ నాయుడు గారి దాతృత్వం తో “చేయూత” “ఆదరణ” కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు 15లక్షల విలువైన కుట్టు మిషన్లు, విద్యార్థినులకు సైకిళ్ళు అందజేశారు. ఎంపిక చేసిన లబ్ది దారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

రెండో రోజు  గ్రేస్ ఫౌండేషన్  వారి సహకారంతో  ఉచితం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు  జరిగాయి.  ఈ సందర్భంగా తానా అధ్యక్షులులావు అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు  చేస్తామని తెలియచేశారు. శ్రీ లోకేష్ నాయుడు గారి వదాన్యతను కొనియాడారు.మదనపల్లె పట్టణం నుంచి మరియు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో  ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు ఆర్థిక స్వావలంబన, సాధికారత దిశగా అవకాశం కల్పించిన లోకేష్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు.

శ్రీ  కొణిదెల లోకేష్ నాయుడు గారు ప్రసంగిస్తూ భవిష్యత్తులో కూడా తానా  ఫౌండేషన్ ద్వారా మదనపల్లె మరియు పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన  సాధికారత,సేవా  కార్యక్రమాలు  నిర్వహించే ప్రణాళిక ఉందని  చెప్పారు. ఈ  సేవాకార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా  తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు, శ్రీ వేమన సతీష్  , సెక్రటరీ శ్రీ  రవి పోట్లురి, తానా చైతన్య స్రవంతి కన్వీనర్ శ్రీ పట్ర  సునీల్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తానా సభ్యులను, ప్రతినిధులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. వారిని ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు మరియు రాజకీయ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసినారు. ఈ కార్యక్రమాన్ని నిరంజన్ నాని, రాజేష్ రాటకొండ,పెరవలి నవీన్, వంశీ నరసింహ, మహేష్ రాటకొండ కో ఆర్డినేట చేసుకొని తమ సహకారం అందచేశారు.  ఈ కార్యక్రమంలో మదన పల్లె తెలుగు దేశం పార్టీ  నాయకులు రాటకొండ బాబు రెడ్డి, జయరామ నాయుడు,తెలుగు యువత  రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు,  నాదెండ్ల విద్యాసాగర్, మధుబాబు మస్తాన్,  ప్రశాంత్ కొప్పారపు, తాజ్ ఖాన్, దొరస్వామి   తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events