వినయ్‌రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగభాషా, నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి ప్రధాన తారాగణంగా వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీ రంగనాయక. గొవిందరాజ్ విష్ణు ఫిలిం పతాకంపై రామావత్ మంగమ్మ వినయ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ను నటుడు, రచయిత తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణుమూర్తిపై వస్తున్న శ్రీరంగ నాయక చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు. వినయ్‌రాజ్ మాట్లాడుతూ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు విష్ణుమూర్తి అవతారాల నేపథ్యంగా భక్తిరస ప్రధానంగా సినిమా సాగుతుందని అన్నారు. అనంతరం దర్శకుడు నంది వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మా చిత్రం అందిరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు. ఆధ్యాత్మిక భావన ప్రేక్షకుల్లో కలిగేలా సినిమా రూపొందించామని, త్వరలో విడుదల చేస్తామన్నారు. శ్రీ రంగనాయక చిత్రంలో అవకాశమిచ్చిన దర్శక`నిర్మాతలకు థ్యాంక్ అన్నారు రంగ భాషా. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు సముద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
