Namaste NRI

హర హర శంకర సాంగ్ రిలీజ్ చేసిన తనికెళ్ళ భరణి

రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం మటన్‌ సూప్‌. విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడు. మల్లిఖార్జున ఎలికా, అరుణ్‌చంద్ర వట్టికూటి, రామకృష్ణ నసపల నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి హర హర శంకర  అని సాగే గీతాన్ని రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు శివ మల్లాల, నటి సునీత మనోహర్‌ కూడా మాట్లాడారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పర్వతనేని రాంబాబు. బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు, సమర్పణ : రామకృష్ణ వట్టికూటి, దర్శకుడు : రామచంద్ర వట్టికూటి ,నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల , కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర, మ్యూజిక్ : వెంకీ వీణ, ఎడిటింగ్ : లోకేష్ కడలి, కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి, పి.ఆర్‌.ఒ : మోహన్ తుమ్మల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events