తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఇటీవల సభ్యుల మధ్య ఘనంగా జరిపారు. అసోసియేషన్ అధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో వరుసగా మూడు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత టీపీఏడీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వనభోజన కార్యక్రమం ద్వారా డల్లాస్‌లోని తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమం డాల్లస్‌లోని హార్స్ రాంచీ, బిగ్ బ్యారెల్ రాంచీ, అరుబ్రే రాంచీ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ అధ్యక్షుడు రవికాంత్ మామిడి, ఉపాధ్యక్షులు రూప కన్నయ్యగారి, శ్రీధర్ వేముల, మాధవి సుంకి రెడ్డి, ఇంద్రాణి పంచెరుపుల, మంజుల తోడుపునూరి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, ఫణీవీర్ కోటి, సీనియర్ టీపీఎడీ టీం మెంబర్ రఘువీర్ బండారు, కో ఆర్డినేటర్ గోలి బుచ్చిరెడ్డి తదితర తెలుగు వారు పాల్గొన్నారు.