ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ తరహాలోనే ప్రపంచాని చైనా నుంచి ముప్పు పొంచి ఉంది. అమెరికా దాన్ని అరికట్టడానికి కొత్త కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. చైనాతో ఆర్థిక, సైనిక రంగాల్లో జరిగే పోటీలో సమతూకాన్ని సాధించడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ త్రిసూత్ర విధానం రూపొందిస్తారని అమెరికా అధికారులు తెలిపారు.














