Namaste NRI

బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బిఎన్‌పి పార్టీ విజయం

బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు గాను మిత్ర పక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిఎన్‌పి నేత తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలపై భారత ప్రధాని నరేంద్ర మోది స్పందిస్తూ తారిఖ్ రెహ్మాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. రెండు దశాబ్దాల తరువాత ఈ పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. అవినీతి కేసుల కారణంగా 17 ఏళ్ల క్రితం దేశం నుంచి వెళ్లిపోయిన రెహమాన్ ఇటీవల రెహ్మాన్ తల్లి జియా ఖలీదా తీవ్ర అనారోగ్యంతో మరణించడంతో పార్టీ పగ్గాలు అందుకుని తాజా ఎన్నికల్లో బిఎన్‌పి ని విజయం దిశగా నడిపించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events