తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా జంటగా రూపొందిన హాస్యప్రధాన కుటుంబకథాచిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఏ.ఆర్.సంజీవ్ దర్శకుడు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిశోర్ జాలాది, బాల సౌమిత్రి నిర్మాతలు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు.

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌ని భరద్వాజ్ గాలి రాయగా, జయ్‌కృష్ణ స్వరపరిచారు. అభయ్ జోధ్‌పుర్కర్ ఆలపించారు. మహిళల గొప్పతనాన్ని ఈ పాట ఆవిష్కరించింది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 23న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి మాటలు: నందకిశోర్ ఈమని, కెమెరా: దీపక్ యెరగరా, నిర్మాణం: ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్.















