షికాగోలో టీడీపీ, జనసేన అభిమానుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. పసుపు సైనికులు, జనసైనికుల కలయికతో స్థానిక మాల్ ఆఫ్ ఇండియా లో ఇండియాలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రలోని తమ అధినాయకుల మధ్య చిగురించిన పొత్తుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు బహిరంగంగా కలిసి మద్దతు తెలపడం ఇదే మొదటిసారి.

ఈ కార్యక్రమానికి అతిథులుగా అనపర్తి టీడీపీ ఇంఛార్జి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, తణుకు ఇంఛార్జి అరుమళ్లి రాధాకృష్ణ, గుడివాడ ఇంఛార్జి వెనిగండ్ల రాము, రైల్వే కోడూరు ఇంఛార్జి ప్రసాద్ జూమ్ కాల్స్ ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ జనసేనల కలయిక రాష్త్రం లో ఎలాంటి ప్రకంపనలు సృష్ఠించ బోతుందో వివరించారు.

వివిధ వక్తలు ప్రసంగిస్తూ చంద్రబాబు గారి విజన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నిష్కళంక మనస్తత్వం, సేవ తత్పరత, పసుపుదళం, జనసైనికుల శక్తి సమ్మిళితమై రాష్ట్రంలోని దుష్ట పరిపాలనను తుడముట్టించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుతుందని, అభివృద్ధి పథంలో మళ్ళీ ముందుకు దూసుకుపోతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడం లో టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు, చికాగో ఎన్నారై టిడిపి అధ్యక్షుడు రవి కాకర, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పెదమల్లు, సెక్రటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్ చిలమకూరు, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, సునీల్ ఆరుమల్లి, యుగంధర్ నగేష్, షికాగో జనసేన నాయకులు వెంకట్ బత్తిన, రవి తోకల, రజనీ ఆకురాతి, కుమార్ నల్లం, ఉమాశంకర్, మిల్వాకి టీడీపీ నాయకులు వెంకట్ చిగురుపాటి తదితరులు కృషి చేశారు.



