రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, బాలా వీరాంజనేయ స్వామి, సాంబశివరావు ఈ లేఖలు రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని, పంట భూములన్నీ సాగర్‌పైనే ఆధారపడ్డాయని లేఖలో ప్రస్తావించారు. కరువు జిల్లా గొంతు కోయవద్దని, పోతిరెడ్డిపాడు పెంపు పునరాలోచనను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గుంటూరు ఛానల్‌ను దగ్గుబాడు వరకూ పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు.