నాని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికీ. నజ్రియా ఫహాద్ కథానాయిక. ఈ నెల 20న టీజర్‌ను విడుల చేయనున్నట్టు తెలిపాయి సినీ వర్గాలు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. అందులో నాయకానాయికలు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్ని అనుసరించి పెళ్లి చేసుకున్న జంటగా సందడి చేశారు. సినిమాలో నాని సుందర్ అనే బ్రాహ్మణ యువకుడిగా, నజ్రియా లీలా థామస్ అనే యువతిగా కనిపిస్తారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రశిశంకర్, వై నిర్మాతలు. జూన్ 10న తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, నికేత్ బొమ్మి ఛాయా గ్రహకుడు.














