Namaste NRI

కలియుగం పట్టణంలో టీజర్ లాంచ్

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణంలో. రమాకాంత్‌రెడ్డి ఈ చిత్రాని కి దర్శకత్వ బాధ్యతతో పాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు. కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డా.రాజేంద్రప్రసాద్‌, దర్శకుడు నక్కిన త్రినాథరావు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఆ నలుగురు  సినిమాలో బాలనటుడిగా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండటం పట్ల రాజేంద్రప్రసాద్‌ ఆనందం వెలిబుచ్చారు. సినిమాపై ప్రేమతో నిర్మాతగా మారానని, రామాకాంత్‌ అద్భుతమైన కథతో ఈ సినిమాను మలిచాడని, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని నిర్మాత కందుల చంద్రఓబుల్‌రెడ్డి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 22న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events