Namaste NRI

తేజ సజ్జ మిరాయ్ .. ట్రైలర్ ఎప్పుడో తెలుసా?

తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ మిరాయ్‌ . రితికా నాయక్‌ కథానాయిక.  కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా సూపర్‌ యోధాగా కనిపించనున్నారు.  ఈ చిత్రం 2డి, 3డి ఫార్మాట్‌లలో, ఎనిమిది భాషల్లో సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇందులో భాగంగా ఈ నెల 28న ట్రైలర్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా, విలన్‌ మంచు మనోజ్‌ ఇద్దరూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ఉన్న ట్రైలర్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. సినిమాపై అంచనాలు పెంచేలా ఈ పోస్టర్‌ ఉన్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో శ్రియా శరణ్‌, జయరామ్‌, జగపతిబాబు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: గౌర హరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events