తెలంగాణా అమెరికన్ అసోసియేషన్, టీటీఏ వ్యవస్థాపకులు డా పైళ్ల మల్లారెడ్డి ఆశీసులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ. ఇందులో భాగంగా అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, అడ్వైసరీ మెంబర్ భారత్ మాదాడి లు మొట్ట మొదటి సారిగా తెలంగాణ కి ప్రీతీ పాత్రమైన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించారు. టీటీఏ అధ్యక్షులు వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీఏ అలయ్ బలయ్ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు.

టీటీఏ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల స్వంత రాష్ట్రం న్యూజెర్సీ లో అలయ్ బలయ్ సంబరాలు అంబరాన్ని అంటాయి. టీటీఏ జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ నేతృత్వంలోని టీటీఏ న్యూజెర్సీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మధుకర్ రెడ్డి, సాయి గుండూర్ ఆధ్వర్యంలో Burke’s Park, Sayreville ( సైరేవిల్లే) నందు శనివారం ఆగస్టు 19, 2023న నిర్వహించిన సంబరాలు 500 మంది ఆహుతులతో కిక్కిరిసింది.

అలయ్ బలయ్ అంటేనే ఆత్మీయ పలకరింపు, తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన ఆహారం మరియు సాంప్రదాయ వినోదాన్ని కలుగచేయటం, ఆలయ్ బలయ్ సంబరాల్లో టీటీఏ Membership Chair అరుణ్ అర్కాల నేతృత్వంలో ప్రత్యేకంగా తయారు చేసిన చక్కటి తెలంగాణ విందు భోజనం అతిధులు ఆస్వాదించారు. అదేవిధంగా అలయ్ బలయ్ కండువాలు ధరించి ఒకరికొకరు ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అమెరికాలో జరుగుతుందా లేక తెలంగాణలో అన్నట్లు మయిమరిపించారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. టీటీఏ యూత్ టీం సభ్యులు ఇషితా మూలే, మోక్ష మాలి, రిషిత జంబుల, సహస్ర ఎల్లంపల్లి, హాసిని అర్కాల, కీర్తి పేరుక, నిమిషా పేరుక అట పాటలు నిర్వహించారు. అలాగే ప్రముఖ తెలుగు సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ కార్యక్రమంలో తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.
అలాగే టీటీఏ న్యూజెర్సీ టీం మరియు TTA కమ్యూనిటీ సర్వీసెస్ టీం చైర్ నర్సింహా పెరుక అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు అయిన సీనియర్ సిటిజన్స్ ని సన్మానించి పెద్దల పైన తమకు వున్న గౌరవాన్ని చాటిచెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
శాంతి నర్రా, New Jersey Middlesex County Deputy Director,
ఉపేంద్ర చివుకుల, Former Commissioner, New Jersey Board of Public Utilities,
అయజ్ పాటిల్, Councilman, Edison Township,
నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి , టీటీఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హాజరయిన టీటీఏ సభ్యులకి మరియు ఈవెంట్ కి హాజరు అయిన అతిథుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ తెలుగు అర్గనైజేషన్స్ TFAS, ATA, NATS, TANA ప్రతినిధులు హాజరయ్యి అలయ్ బలయ్ శుభాకాంక్షలు తెలిపారు.

టీటీఏ న్యూజెర్సీ టీం సభ్యులు అరుణ్ అర్కాల, ప్రశాంత్ నలుబంధు, నవీన్ కౌలూరు, శంకర్ రెడ్డి వులుపుల, రాజా నీలం, శ్రీనివాస్ రెడ్డి మాలి, శ్రీనివాస్ జక్కిరెడ్డి, ప్రణీత్ నల్లపాటి, శివ నారా, వెంకీ, సుమంత్, దీప జలగం, సంధ్య కాసుల, నవీన్ యలమండల, కృష్ణ మోహన్ రెడ్డి, అష్రిత్ వచ్చిన వారి అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.
