మలేషియాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావించి పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలు, తెలంగాణ సాధన, అభివృద్ధి, నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలన్నారు.


కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మలేషియా ఫౌండర్ చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షులు మునిగల అరుణ్, కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, బొడ్డు తిరుపతి, హరీష్ గుడిపాటి, శ్యామ్, పూర్ణ చందర్ రావు, కిషోర్, క్రాంతి , విజయ్, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి పాల్గొన్నారు.

