Namaste NRI

ఒమన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒమన్‌ దేశ రాజధాని మస్కట్‌లోని ఘలాలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రాయల్ హాస్పిటల్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో భారత జాగృతి, బీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్  ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్ రెడ్డి, భారత్ జాగృతి ఒమాన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్, బీఆర్ఎస్‌ ఒమాన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేష్, భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్‌ పాల్గొన్నారు.

ఈ శిబిరంలో తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల  ను ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సాయి రాజు, రాజేందర్, వంశీ, రంజిత్,ప్రమోద్ రెడ్డి, విజయ్,మెడ పట్ల లక్ష్మణ్ ,జగన్,కొయ్యాడి వంశీ ,మంత్రి గోపాల్ ,రంజిత్ కశామొల్ల,కొమురయ్య,వేణు,రాజు, నరేష్ ,రాజేందర్,రంజిత్,శ్రీనివాస్ నేత,అక్తర్,జంబుకా శ్రీనివాస్,గంగాధర్,ప్రదీప్,సుమన్,నాగరాజు,అశోక్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events