గత పదేళ్లుగా సినీ రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ పార్టీకి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు పింఛన్లు అందేలా సహాయం చేశారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ మరింతగా అభివృద్ధి సాధించాలంటే బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సత్యప్రకాష్, నిర్మాత గురురాజ్, నిర్మాత సాగర్, నిర్మాత కాచం సత్యనారాయణ, డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్, నిర్మాత రమేష్ నాయుడు, డైరెక్టర్ నర్సింహ, నిర్మాత ఇ.వి.యం.చారి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)