Namaste NRI

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్‌ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు.

సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపు తెచ్చారు. బాలోత్సవ్‌లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరఫున బహుమతులు అందించారు. నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు చేసిన ఏర్పాట్లతో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి.

ఈ  కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News