కువైట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆ నినాదాలను నేడు నిజం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. పచ్చని పంటలు, అనేక ప్రాజెక్టులతో రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షుడు వినయ్ యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షుడు వెంకట్ కోడూరి, అశోక్, మహ్మద్ దస్తగిరి, రవి సుదగాని, సరోజ రెడ్డి, అయ్యప్ప, సురేష్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














