Namaste NRI

న్యూజిలాండ్ ఎంపీగా తెలుగమ్మాయి

న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికైంది. గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న మేఘన చదువుతో పాటు సోషల్‌ సర్వీస్‌ చేయడంతో ముందుండటంతో న్యూజిలాండ్‌ ఎంపీగా ఎన్నికైంది. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్‌ పదవికి ఎంపికైంది. మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్‌, ఉష దంపతులు 2011లో న్యూజిలాండ్‌ వెళ్లారు. మేఘన అక్కడే పుట్టి పెరిగింది.  కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో విద్యాభాస్యం పూర్తి చేసింది. స్కూల్‌ డేస్‌ నుంచే మేఘన పలు చారిటీ కార్యక్రమాలు చేపడుతుంది. స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు అందజేస్తుంది. వలస వచ్చిన ఇతర దేశాలకు  శరణార్థులకు విద్య, కనీస వసతులు కల్పించడంలోనూ సహాయపడుతుంది. దీంతో ఆమె సేవలను గుర్తించి న్యూజిలాండ్‌ ప్రభుత్వం యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా నామినేట్‌ చేసింది. మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events