Namaste NRI

కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది : జోజు జార్జ్‌

మలయాళ నటుడు, దర్శకుడు జోజు జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన పని  చిత్రం అదే పేరుతో తెలుగులో ఈ నెల 13న విడుదల కానుంది. అభినయ కీలక పాత్రధారి. ఆమ్‌ వర్డ్‌ ఎంటైర్టెన్మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.  జోజు జార్జ్‌ మాట్లాడుతూ పని కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌. అందరూ మనసుపెట్టి చేసిన సినిమా ఇది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అని నమ్మకం వెలిబుచ్చారు. దంపతులు తమకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ చిత్రానికి కెమెరా: వేణు ఐఎస్‌సీ, జినోజార్జ్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress