ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణవార్త బాధాకరం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తెలుగు కళాసమితి, ఒమన్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మా ఆనందాన్ని, మా బాధని, మా మౌనాన్ని, కోపాన్ని, వేదనను అన్ని భావాలకు “అక్షర రూపాన్ని” ఇచ్చిన మీకు శతకోటి నీరాజనాలు. అర్థ శతాబ్దపు ఆజ్ఞానాన్నే స్వతంత్ర మందామా… జానవులే వర వీనవులే… అపురూప మైన దమ్మ ఆడ జన్మ… నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని… నమ్మకు నమ్మకు ఈ రేయిని… జగమంత కుటుంబం నాది ఏ కాకి జీవితం నాది… తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం… చిలుకా క్షేమమా! కులుకా కుశలమా… సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు… ఇలా ఒకటా,రెండా వందలా వేలా… విరించినై, విపంచినై, సిరివెన్నెల ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అని దివికేగావా మహర్షి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)