Namaste NRI

టెక్కాస్ మెడికల్ బోర్డు సభ్యునిగా మరోసారి తెలుగు తేజం

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక టెక్సాస్‌ మెడికల్‌ బోర్డులో తెలుగు తేజం ప్రవాసాంధ్రులు,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్‌ జయరామ్‌ నాయుడుకి మరోసారి అవకాశం దక్కించుకున్నారు.  మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును గవర్నర్‌ గ్రెగ్‌ అబాబ్‌ ఇటీవల నియమించారు. 2027 ఏప్రిల్‌ 13 వరకూ ఈ బోర్డు పని  చేస్తుంది. ప్రజారోగ్య భద్రత, పరిరక్షణతో పాటు నిబంధనలు పాటించేలా చూడటం, నాణ్యమైన వైద్యసేవలు అందేలా పర్యవేక్షణ తదితర విధులను నిర్వహిస్తుంది. నాయుడు క్లినిక్‌కు ప్రెసిడెంట్‌గా, టెక్సాస్‌ విశ్వవిద్యాలయ హెల్త్‌నైస్సెస్‌ సెంటర్‌లో అసిస్టెంట్‌ క్లినికల్‌ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న జయరామ్‌ నాయుడు.

                సుమారు నాలుగు దశాబ్దాలుగా వైద్యరంగంలో సేవలందిస్తున్నారు. వివిధ పదవులతో పాటు 2017`22 మధ్య టెక్సాస్‌ మెడికల్‌ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా చెందిన ఆయన గుంటూరు వైద్య కళాశాల నుంచి 1966లో వైద్యశాస్త్ర పట్టా పొందారు. అనంతరం అమెరికాలోని న్యూయార్క్‌ ఏపీ లగాన్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ రెసిడెన్సీ ఇంటర్నల్‌ మెడిసిన్‌ పూర్తి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events