Namaste NRI

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన ఎంక్యూ-1 డ్రోన్‌ ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. శత్రుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఉద్దేశంతో తమ జలాల్లోకి ప్రవేశించిన డ్రోన్‌ను వెంటనే గుర్తించి, గగనతల రక్షణ క్షిపణులతో కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ తన ప్రకటనలో పేర్కొన్నది. 

ఇటీవలికాలంలో అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. గత వారం కూడా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను తమ గగనతల రక్షణ విభాగాలు కూల్చివేశాయని ఐఆర్‌జీసీ తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని అప్పుడే ఇరాన్ హెచ్చరించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన ఒక యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నాయి. మరోవైపు, ఇరాన్‌పై తాము ఆత్మరక్షణ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News