Namaste NRI

అమెరికాలో  ఘోర ప్రమాదం

అమెరికాలో ఘోర రైలు  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిస్సోరిలోని మెండన్‌ టౌన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ భారీ ట్రక్‌ను రైలు ఢీకొట్టడంతో పట్టాలు తప్పి బోగీలన్ని పక్క ఓరిగిపోయాయి. రెస్క్కూటీమ్‌ ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.  ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు.  మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్‌ట్రాక్‌ రైలు లాస్‌ ఏంజిలిస్‌ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది. టైర్లు ఎగిరిపడ్డాయి. కొన్ని మీటర్ల దూరం వరకు రైలు ట్రక్కును లాక్కెళ్లి ఆ తరువాత పట్టాలు తప్పింది.  బోగీలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికులు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని బయటికి రావడం కనిపించిందని స్థానికులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events