Namaste NRI

అమెరికాపై ఎప్పుడైనా ఉగ్రదాడి జరగొచ్చు : పెంటగాన్‌ హెచ్చరిక

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వెళ్లిపోయిన అమెరికాపై మరో ఆరు నెలల్లో ఉగ్రదాద దాడి జరిగే ముప్పుందని ఆ దేశ రక్షణ రంగ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. ఆప్ఘన్‌ గడ్డపై నుంచి ఐఎస్కే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పెంటగాన్‌ అధికారులు ప్రకటించారు. ఆ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని అమెరికా కాంగ్రెస్‌కు వివరించారు. ఐఎస్కేతో తాలిబన్లకు శత్రుత్వం ఉందని, దీంతో వారిపై ఉక్కుపాదం మోపేందుకు చట్టం తీసుకురావాలని తాలిబన్లు యోచిస్తున్నారని అన్నారు. తాలిబన్లు వారిపై గెలుస్తారా? అన్నది అనుమానమేనని అన్నారు.

                ఈ నేపథ్యంలో అమెరికాకు ఐఎస్కేతో ఎప్పటికైనా ముప్పేనని అధికారులు హెచ్చరించారు. కొన్ని వేల మంది ఉగ్రవాదులు అందులో ఉన్నారని, అమెరికాపై దాడి చేసేలా సంస్థ వారిని తయారు చేస్తోందని తెలిపారు. ఆల్‌ ఖాయిదా కూడా దాడి చేసేందుకు వ్యూహాలు  రచిస్తోందన్నారు. తాలిబన్ల సాయంతో ఆ ఉగ్రసంస్థ మళ్లీ బలపడే అవకాశం ఉందన్నారు. రెండేళ్లలో అది కూడా అమెరికాపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. అటు ఆల్‌ఖైదా కూడా మరోసారి దేశానికి సమస్య కానుందని తెలిపారు. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్‌ గడ్డపై ఆల్‌ఖైతా మళ్లీ పుంజుకొనే అకాశం ఉందని, రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events