భారత్‌లో టెస్లా కంపెనీ ఏర్పాటు చేస్తామన్న ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ అన్నారు. ప్రధాని మోదీతో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన సంభాషణలో ఇద్దరు పలు విషయాల గురించి చర్చికున్నారు. వీలైనంత త్వరగానే టెస్లా సంస్థను ఇండియాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత భవిష్యత్తుపై తనకు నమ్మకం ఉందని, ప్రపంచదేశాల్లో ఆ దేశానికి ప్రత్యేక స్థానం ఉందని మస్క్ అన్నారు. భారతీయ మార్కెట్‌పై ఆసక్తి ఉందని అన్నారు. ఎనర్జీ నుంచి ఆధ్మాత్మికత వరకు అనేక అంశాలపై మస్క్‌తో చర్చించానని ప్రధాని తెలిపారు. వచ్చే ఏడాది ఇండియాలో పర్యటించనున్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రధాని మోదీ గతంలో తమ టెస్లా కంపెనీని సందర్శించారని మస్క్ గుర్తుచేశారు. మోదీని మరోమారు కలుసుకోవడం సంతోషంగా ఉందని, తమ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.


