Namaste NRI

టెస్లా భారీ షాక్.. ఒకేసారి ఆరు వేల మందిపై వేటు

ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. తాజాగా గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గజం టెస్లా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. టెక్సాస్‌,  కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాల ని సంస్థ యోచిస్తోంది. వాహ‌న విక్రయాలు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిసింది.

జూన్‌ 14 నుంచి కాలిఫోర్నియాలో 3,332 మంది ఉద్యోగులను, టెక్సాస్‌లో 2,688 మంది ఉద్యోగులను తొలగిం చనున్నట్లు నివేదించింది. యూఎస్‌ కార్మిక చట్టాలకు అనుగుణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతవారం టెస్లా ప్రపంచవ్యాప్తంగా 10 శాతానికి పైగా ఉద్యోగుల‌పై వేటు వేయ‌నున్నట్లు అంత ర్జాతీయ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. వాహ‌న విక్రయాలు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ త‌దుప‌రి వృద్ధి ద‌శ‌కు స‌న్నద్ధమ‌య్యే క్రమంలో వ్యయ నియంత్రణ‌, ఉత్పాద‌ క‌త పెంపు దిశ‌గా తాము అన్ని అవ‌కాశాల‌నూ ప‌రిశీలించడం కీల‌క‌మ‌ని ఇంట‌ర్నల్ మెమోలో సీఈవో ఎలాన్ మ‌స్క్ పేర్కొన్నార‌ని ఆ ప‌బ్లికేష‌న్ తెలిపింది. అయితే, ఎంత మందిని తొలగిస్తారన్నది మాత్రం అప్పుడు వెల్లడించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events