Namaste NRI

తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు  ధన్యవాదాలు : నాగార్జున

నాగార్జున నటించిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం నా సామిరంగ. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై తెరకెక్కింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా చక్కటి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ వేదికపై నాగార్జున చేతుల మీదుగా చిత్ర బృందానికి సక్సెస్‌ షీల్డ్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ  సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రేక్షకులు నాకు ఎప్పుడూ ప్రేమను పంచుతున్నారు. నేను కనిపించగానే ప్రేక్షకులు చిరునవ్వుతో వ్యక్తం చేసే ఆ ఆనందమే నాకు ధైర్యం. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ఈ అద్భుతమైన అనుభూతి పంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events