Namaste NRI

 ఆ దేశ వీసా ఆంక్ష‌లు రద్దు 

మొరాకో దేశ‌స్థుల‌పై వీసా ఆంక్ష‌ల్ని ఫ్రాన్స్ త్వ‌ర‌లోనే ఎత్తేయ‌నుంది. మొరాకో దేశ‌స్థుల‌పై విధించిన వీసా ఆంక్ష‌లు రద్దు చేస్తామ‌ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కేథ‌రిన్ కలొన్న  వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 16వ తేదీన మొరాకో రాజ‌ధాని ర‌బ‌త్‌లో ఆమె ఆ దేశ విదేశాంగ మంత్రి న‌సీర్ బౌరిత‌ను క‌లుసుకున్నారు. ఫ్రాన్స్‌లో 7 ల‌క్ష‌ల మందికి పైగా మొరాకో మూలాలున్న ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. వీసా నిబంధ‌న‌ల కార‌ణంగా మొరాకో నుంచి వ‌చ్చే బంధువులు వీళ్ల‌ను క‌ల‌వ‌లేక‌పోతున్నారు. దాంతో, ఈ విష‌య‌మై మొరాకో, ఫ్రాన్స్ దేశాల మ‌ధ్య సంవ‌త్స‌ర కాలంగా వివాదం న‌డుస్తోంది.

ఫ్రాన్స్‌లో నివ‌సిస్తున్న త‌మ పౌరుల‌ను స్వ‌దేశాల‌కు ఉత్త‌ర ఆఫ్రికా దేశాలు అంగీక‌రించ‌లేదు. దాంతో ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి వ‌చ్చింది. అందువ‌ల్ల‌ స‌రైన ధ్రువ ప‌త్రాలు లేకుండా త‌మ దేశానికి వ‌చ్చే మొరాకో, అల్జీరియా, ట్యునియా దేశ‌స్థుల‌కు జారీ చేసే వీసాల‌పై ఫ్రాన్స్‌ కోత విధించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events