Namaste NRI

ఆ గడువు పెంచాల్సిందే…లేదంటే కష్టం

హెచ్‌1-బీ వీసాదారులకు ఇస్తున్న గ్రేస్‌ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలంటూ అమెరికా అధ్యక్షుని సలహా ఉపసంఘం (వలస వ్యవహారాలు) సిఫారసు చేసింది. హెచ్‌1-బీ వీసాపై అమెరికాకు వచ్చినవారు తాము చేస్తున్న పనిని వదిలేసినా లేదా వారిని సంస్థ తొలగించినా కొత్త సంస్థలో అరవై రోజుల్లోగా చేరాలనే నియమం ఇప్పటివరకు ఉంది.

ఈ ప్రతిపాదనపై ఉపసంఘంలో సభ్యుడు అజయ్‌ జైన్‌ భుటోరియా ప్రజంటేషన్‌ ఇచ్చారు. చేస్తున్న పని పోయి కొత్త ఉపాధిని సంపాదించుకోవడం హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో చాలా కష్టంగా ఉన్నదని ఆయన తెలిపారు. హెచ్‌-1బీ హోదా బదిలీకి సంబంధించిన పత్రాలు సంపాదించుకోవడంలోని సంక్లిష్టత, వలస సేవల విభాగంలో దరఖాస్తు పరిశీలనకు ఎక్కువ కాలం పడుతుండటం వంటి కారణాల వల్ల ఇప్పుడు ఇస్తున్న గ్రేస్‌ పీరియడ్‌ సరిపోవడం లేదన్నారు. దానివల్ల చాలామంది బలవంతంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. అందువల్ల ఇప్పుడిస్తున్న గ్రేస్‌ పీరియడ్‌కు అదనంగా మరో 120 రోజులు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events