తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారని ఎన్నారై టీఆర్ఎస్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియమకాలు చేపడుతామని తెలిపిన సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు బంధువుగా మారాడని అన్నారు. అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటుతున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ముందుకు సాగింది. ఆ కల నేడు సాకారం అయిందన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో 95 శాతం స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నారైల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఏడు సంవత్సర కాలంలో మోదీ ప్రభుత్వం కనీసం కోటీ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మండిపడ్డారు.














