జాతీయ పతాకానికి సంబంధించి భారత్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది.బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగగా 1857 తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన అప్పటి జగ్దీష్‌పుర్ రాజు వీర్‌కున్వర్ సింగ్ 164 వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 78,220 మది ప్రజలు జాతీయ పతకాలను చేతబూని ఏకకాలంలో 5 నిమిషాల పాటు అటూఇటూ ఊపుతూ గిన్నిస్ రికార్డు సృష్టించారని వివరించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏకకాలంలో అత్యధిక మంది జాతీయ పతాకాలను గాల్లో అటూఇటూ ఊపుతూ చేపట్టిన కార్యక్రమానికి గిన్నిస్ పుస్తకంలో చోటు లభించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది.