రెజీనా కాసాండ్ర, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శాకిని డాకిని. కొరియన్ ఫిల్మ్ మిడ్నైట్ రన్నర్స్ కు తెలుగు రీమేక్‌గా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ యథామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 16న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిక రెజీనా మాట్లాడుతూ నా తొలి చిత్రం నుంచీ నాకు యాక్షన్ చేయడమంటే చాలా ఇష్టం. మొత్తానికి ఆ కోరిక ఈ సినిమాతోనే నెరవేరింది అంది. నివేదా థామస్ మాట్లాడుతూ మా ఇద్దర మధ్య చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్ ఉంటుంది. ఈ చిత్ర యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం అని తెలిపింది. నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్‌ని ఎంతో సాహసంతో చాకచక్యంగా ఎలా డీల్ చేశారన్నదే ఈ చిత్ర కథ. ఎగ్ హార్వెస్టింగ్ అనే వినూత్నమైన పాయింట్ ఈ కథలో ఉంది అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)