Namaste NRI

అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే :నిత్యామీనన్‌

అగ్ర కథానాయిక నిత్యామీనన్‌ నటించిన తాజా రొమాంటిక్‌ కామెడీ చిత్రం సార్‌ మేడమ్‌. త్వరలో విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన జీవితంలో విఫలప్రేమ జ్ఞాపకాలున్నాయని, అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయానని చెప్పింది.  ప్రేమ, పెళ్లి గురించి నిర్మొహమాటంగా తన మనసులో మాటల్ని బయటపెట్టింది. గత ప్రేమబంధాలన్నీ విఫలమై మనోవేదనను మిగిల్చాయని, వాటి నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది.

యుక్త వయసులో ఉన్నప్పుడు సోల్‌మేట్‌ తప్పకుండా అవసరమనే భావనతో ఉండేదాన్ని. అతని కోసం అన్వేషించిన సందర్భాలున్నాయి. కానీ జీవితప్రయాణంలో నా అభిప్రాయాలు మారాయి. పెళ్లనేది కేవలం ఓ ఎంపిక మాత్రమేనని, తప్పనిసరి అవసరం కాదని అర్థం చేసుకున్నా. పెళ్లయితే అది చాలా గొప్ప విషయం, ఒకవేళ కాకున్నా అదీ గొప్ప విషయమే. తోడులేదని కాస్త బాధగా ఉన్నా స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రతన్‌టాటా కూడా వివాహం చేసుకోలేదు. అయినా ఆయన జీవితంలో ఎన్నో విజయాలున్నాయి. ఏది జరిగినా అంతా మంచికే అనుకొని ముందుకుసాగాలి అని చెప్పుకొచ్చింది.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events