Namaste NRI

అందుకే చైనాపై కన్నేశాం : అమెరికా

 చైనా కదలికలపై అమెరికా సహా నాటో సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌ తెలిపారు.  నాటో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బ్లింకెన్‌ మాట్లాడారు. చైనా అనురిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయని అన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, అంతే కాకుండా సైనిక శక్తిని పెంచుకుంటున్న వేగంపై కూడా నిఘా ఉంచామని తెలిపారు.  రష్యాతో కుమ్మక్కైన విషయం ఏనాడో గుర్తించామని,  అయినప్పటికీ చైనాతో మాట్లాడుతున్మాన్నారు. రష్యా, చైనాలకు చెందిన యుద్ధ విమానాలు జపాన్‌ సముద్ర సరిహద్దు వద్ద ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించారు. అలాగే రెండు చైనీస్‌, 6 రష్యా యుద్ధ విమానాలను దక్షిణ కొరియా సమీపంలో ప్రయాణించాయి.  చైనా 2035 నాటికి 1500 అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నదని రెండు రోజుల క్రితం పెంటగాన్‌ నివేదిక ఒకటి వెల్లడిరచింది. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events