Namaste NRI

ఘనంగా ముగిసిన 18వ ఆటా మహాసభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా)  2024 వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదిక‌గా జూన్ 7 నుండి 9 వరకు జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.

ఆటా నవల పోటీలు.. త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. ఈల‌లు గోల‌ల‌తో మార్మోగిపోయింది. భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజర‌య్యారు. యూత్ కమిటీ సమావేశాలు ఈసారి హైలైట్‌గా నిలిచాయి. ఏఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మ కంగా సాగాయి. ఉమెన్స్ ఫోరమ్‌లో మహిళా సాధికారత, గృహ హింస వంటి అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్‌తో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు.

బిజినెస్ ఫోరమ్‌లో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్‌గా వ్యవహరించారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్‌కు అందజేశారు.

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత జరిగాయి. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events