ఈమధ్య ఉత్తర కొరియా జరిపిన వరుస క్షిపణి పరీక్షల ఉద్దేశం ఏంటని సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే ఈ క్షిపణి పరీక్షల గురించి ఉత్తర కొరియా ఆర్మీ ఒక ప్రకటన చేసింది. ఇటీవల తాము నిర్వహించిన క్షిపణి పరీక్షల లక్ష్యం దక్షిణ కొరియా, అమెరికా కీలక వైమానిక స్థావరాలు, కమాండిరగ్ నిర్వహణ కేంద్రాలపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడమేనని ఉత్తర కొరియా ప్రకటించింది. గత వారం పరీక్షించిన వాటిలో ఆయుధాలు అమర్చిన బాలిస్టిక్ క్షిపణులతో పాటు శత్రువుల విమానాలను నేలకూల్చే క్షిపణులు కూడా ఉన్నాయని ఉత్తర కొరియా వెల్లడిరచింది. కొన్ని క్షిపణులకు అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉందని వివరించింది. దక్షిణ కొరియా, అమెరికా బెదిరింపులతో వెనక్కి తగ్గరాదన్న కృతనిశ్చయాన్ని తమ అధినేత కిమ్ జోంగ్ ఉన్ కలిగి ఉన్నారని ఆ దేశ సైనికాధికారులు పేర్కొన్నారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేయడంతో దక్షిణ కొరియాతో పాటు జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.